18 June, 2026 | 2:12 AM

చర్ల ప్రాజెక్టులో ‘అమ్మ మాట - అంగన్వాడి బడిబాట’

18-06-2026 12:56 AM

చర్ల, జూన్ 17 (విజయక్రాంతి): చర్ల ప్రాజెక్టు పరిధిలోని కుదునూరు, రాల్లాపురం గ్రామాల్లో బుధవారం ’అమ్మ మాట - అంగన్వాడి బడిబాట’ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కుదునూరు, రాళ్లపురం అంగన్వాడి కేంద్రాల్లో.. అంగన్వాడి కేంద్రం నుంచి తల్లులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిహెచ్‌ఆర్ కింద పిల్లలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి సిడిపిఓ రేవతి మేడం ముఖ్య అతిథిగా హాజరై తల్లులతో మాట్లాడారు. సూపర్వైజర్ ఆదిలక్ష్మి, గ్రామస్తులు, తల్లులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లోనూ తల్లులతో సంభాషించి పిల్లల పోషణ, పాఠశాల పూర్వ విద్య ప్రాధాన్యతను వివరించారు. చర్ల ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు గ్రామ ప్రజలు సహకరించారు.