ఈజీ ఫార్మసీ యాప్‌తో ఇంటికే ఔషధాలు
అడ్రోటెక్ సొల్యూషన్స్ సీఈఓ చల్లా చిరంజీవి
పంజాగుట్ట,ఆగస్టు2(విజయక్రాంతి):తమ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈజీ ఫార్మసీ యాప్ తో రోగుల ఇంటి వద్దకే ఔషధాలు డెలివరీ చేస్తామని అడ్రోటెక్ సొల్యూ షన్స్ సీఈఓ చల్లా చిరంజీవి తెలిపారు.నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ (ఎఐఎంఏ) ఆధ్వర్యంలో మెడికో-లీగల్ అం డ్ ప్రాక్టీస్ ప్రొటెక్షన్ వర్క్ షాప్ ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈజీ ఫార్మసీ యాప్ ను వైద్య నిపుణులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో అసలైన ఔషధాలను ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమన్నారు. అంతేకాకుండా అందుబాటు ధరల్లో వాటిని యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చని పే ర్కొన్నారు. స్మార్ట్ఫోన్ వినియోగంలో అనుభవం లేని వారు, గ్రామీణ మరియు వెనుక బడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలను దృష్టి లో ఉంచుకుని వాట్సాప్ ఆధారిత ఆర్డరింగ్ విధానాన్ని అభివృద్ధి చేశామన్నారు.సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా దూర ప్రాంతాలకు కూడా నిర్ణీత సమయంలో మందులను చేరవేసే సౌకర్యం కల్పించామన్నారు .
వినియోగదారులు, మెడికల్ షాపుల తో పాటు వైద్యులు, క్లినిక్లు,ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థలకు కూడా ఈజీ ఫార్మ సీ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. వైద్యులు సూచించిన మందులను రోగులు సమీపంలోని విశ్వసనీయ ఫార్మసీల నుంచి సులభంగా పొందేలా ఈ ప్లా ట్ఫారమ్ సహకరిస్తుందని తెలిపారు.దీంతో చికిత్సలో నిరంతరత పెరగడంతో పాటు మెరుగైన వైద్య ఫలితాలు సాధించడానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అడ్రోటెక్ సొల్యూషన్స్ కో ఫౌండర్ పూరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ యాప్ ద్వారా లభించే ఆదాయాన్ని ఫార్మసీలతో పంచుకోవడం జరుగుతుందన్నారు. అందుకు వారు ఎటువంటి ప్రారంభ పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదన్నారు.ఫార్మసీ నిర్వా హకులు,ఆసుపత్రులు,ఇతర ఆరోగ్య సేవల సంస్థలు ఈజీ ఫార్మసీని వినియోగించి తమ సూచనలు,అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.వాటి ఆధారంగా ప్లాట్ఫారమ్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎంఏ సభ్యులు, అడ్రోటెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






