19 April, 2026 | 6:49 PM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

19-04-2026 05:02 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1986-87 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న వారి హోదాలను పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. 40 సంవత్సరాల అనంతరం విద్యార్థులంతా ఒక వేదికపై కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఒకరినొకరు శాలువులతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.

1986-87 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల్లో మండలంలోని రాఘవపల్లి గ్రామానికి చెందిన గడిల వెంకట్రాంరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెదక్ సంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్నారు. మాల్తుమ్మెద గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి లీగల్ అథారిటీ మానవ హక్కుల పరిరక్షణ డైరెక్టర్గా పనిచేస్తున్నారని వేదిక సందర్భంగా పరిచయం చేసుకున్నారు. ఎండి రషీద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారన్నారు. అలాగే వెంకుపల్లి గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి 1997లో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం సాధించి నెలకు వెయ్యి రూపాయల జీతంతో పనిచేసి వెంకంపల్లి నుండి సైకల్పై అడ్లూరు ఎల్లారెడ్డి వరకు ఉద్యోగారీత్యా వెళ్లేవారని తెలిపారు.

వీరితో పాటు మరికొందరు మంచి పదవులు పొంది స్థిరపడ్డారని తెలిపారు.40 సంవత్సరాలు అనంతరం అందరు కలుసుకొని ఒకే తాటిపై ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్యాంసుందర్, దివిటి సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి,రవీందర్ రెడ్డి,లక్ష్మారెడ్డి,వెంకట్రెడ్డి, సంజీవరెడ్డి,వెంకట్రాంరెడ్డి, సుభాకర్ రెడ్డి,ఎండి సముద్, నరేందర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,వడ్ల సత్యనారాయణ,అవసుల శ్రీనివాస్,పీర్ రెడ్డి,మంగలి సత్యనారాయణ,వెంకట్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.