19 April, 2026 | 7:03 PM

మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు

19-04-2026 05:00 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కుంటాల ఓలా పెంచికల్ పాడ్, కల్లూరులో మొక్క కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మాజీ మంత్రి ఇంద్రకంటి ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ సహకారంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.