4 May, 2026 | 7:02 PM

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

04-05-2026 05:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): మేనేజ్మెంట్ హాస్టల్‌కు చెందిన 2000 నుండి 2025 వరకు చదివిన పూర్వ విద్యార్థులు మారుతీ ఇన్ హోటల్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నిర్వహించారు. గౌతమ బుద్ధుడు మరియు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకు పూజలు చేశారు అప్పటి హాస్టల్ వార్డెన్ నీరటి రాజేశ్వర్, హాస్టల్‌కు భవనం ఇచ్చిన అయిండ్ల భూపాల్ రెడ్డి, అతిథిగా హాజరైన నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి గారులను సన్మానించారు.

పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని, ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్రస్తుతం వారు పోలీస్ శాఖ, విద్యా రంగం, వ్యాపారం, ప్రైవేట్ సంస్థలు, రాజకీయాలు, కళారంగాల్లో స్థిరపడినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ సమ్మేళనం నిర్వహించాలని తీర్మానం చేశారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారందరికీ మెమొంటోలు అందజేశారు. మధ్యలో జానపద కళాకారులు అష్ట దిగంబర్, లక్ష్మణ్, విట్టల్, పెంటయ్య, రవీందర్, కిషోర్ పాటలతో అలరించారు. కార్యక్రమ సమన్వయాన్ని డి. సుధాకర్ నిర్వహించగా, రమేష్, ప్రమోద్, కాంబ్లీ విట్టల్, భీంరావ్, మురళి, వాడేకర్ లక్ష్మణ్, దిగంబర్, కిషోర్, అనిల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.