7 March, 2026 | 12:21 PM

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జయప్రదం చేయండి

06-03-2026 08:09 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడవ మహాసభలను మార్చి 24 25 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,  ప్రజా కవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, హాజరవుతున్నట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ విజయాలు సాధించిన చరిత్ర ఉందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఇళ్ల స్థలాలు సాగు భూములు పోడు భూములు రైతుల కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని సందర్భంగా జరిగే ఈ జిల్లా మహాసభలను జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.