7 March, 2026 | 1:57 PM

ల్యాబ్ ఫర్నిచర్ బహుకరించిన క్యూరియా కంపెనీ ప్రతినిధులకు సన్మానం

06-03-2026 08:06 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి జెడ్పిహెచ్ఎస్ కు రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ ను బహూకరించిన  క్యూరియా ఫార్మా కంపెనీ ప్రతినిధులకు ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానం నిర్వహించారు.

గత నెలలో గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి క్యూరియా కంపెనీ పరిశోధనాత్మక శాస్త్రవేత్త ఆవుల రాఘవేందర్ సూచన మేరకు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలకు రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ ను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు అయిన హైదరాబాద్ సైట్ హెడ్ మురళీకృష్ణ, హెచ్ఆర్ హెడ్ చిక్కాల వెంకట్, సీనియర్ హెచ్ఆర్ బోనగిరి జ్యోతి, సౌమిత్ర లకు పూలమాలలు కప్పి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

గ్రామ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని వారు అభిలాషించారు. గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఆవుల రాఘవేందర్ కృషితో కంపెనీ ప్రతినిధులు తమ పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల జానయ్య, ఆవుల రాము, తాటి చంద్రమౌళి, గుండెబోయిన నరసింహ, గుజరి యాదగిరి పాల్గొన్నారు.