10 July, 2026 | 3:09 AM

హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలే..

10-07-2026 01:50 AM

ఏబీవీపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ దృహన్

గజ్వేల్, జూలై 9: ఎబీవీపీ గజ్వేల్ నగర శాఖ ఆధ్వర్యంలో గురువారం 78వ ఆవిర్భా వ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర మీడియా కన్వీనర్ దృహన్ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల హా మీలను వెంటనే అమలు చేయాలని డిమాం డ్ చేశారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని, రైతులకు గిట్టుబా టు ధర, బోనస్ అందించాలని కోరారు. హా మీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవులపల్లి మహేందర్, నగర కార్యదర్శి గురు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.