2 May, 2026 | 4:58 PM

ఆంజనేయరావుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా అదనపు బాధ్యతలు

02-05-2026 03:32 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నూతనంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గా హుజురాబాద్ జూనియర్ కళాశాల లొ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న వి. ఆంజనేయరావు  కు అదనపు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం తొలిసారిగా ప్రభుత్వ సైన్స్ కళాశాల కరీంనగర్‌ ,ను సందర్శించి కళాశాలలో కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థుల కోసం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్న రెమిడి క్లాసుల తీరుతెన్నులు, విద్యార్థుల హాజరు శాతం, బోధనా విధానాలు, అధ్యాపకుల పనితీరు,  పై సమీక్ష నిర్వహించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రెమిడి క్లాసులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.