18న ఇందిరాపార్కు వద్ద ఉద్యమకారుల ధర్నా
శ్రావణ బోయిన నరసయ్య
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 16, (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రావణ బోయిన నరసయ్య పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 18 తా.కు. ఉదయం 10గం.కు ఇందిరాపార్క్ వద్ద ఉద్యమ కారుల సమస్యల పరిష్కారంకై ధర్నా కార్యక్రమం జరుగుతుంది.
కావున 33 జిల్లాల ఉద్యమ కారులు పాల్గొని ధర్నాను విజయ వంతంచేయాలని కోరారు. ఉద్యమ కారుల పెన్షన్, తదితరల సమస్యలపై జరుగుతున్న పోరాటం లో బాగంగా హైదరాబాద్ లో ఉద్యమ గర్జన జరుగుతుందని తెలంగాణ ఉద్యమ కారులందరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో, రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శికాకెళ్ళి, సైమన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లి రాజయ్య కుడిక్యాల సమ్మయ్య సర్దార్ బేగ్ అలిముద్దిన్ , జావేద్, దేవులపల్లి రాంమూర్తి, శ్రీపాద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






