17 June, 2026 | 3:34 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు

17-06-2026 02:22 AM

7 కేసులు నమోదు, పత్రాలు లేని 30 వాహనాలకు జరిమానాలు

గద్వాల టౌన్ జూన్ 16: జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై కేసులు నమోదు చేయగా,అవసరమైన పత్రాలు లేని 30 వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి పత్రాలను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.