17 June, 2026 | 1:16 AM

బోనాలకు ముహూర్తం ఖరారు

17-06-2026 12:02 AM

ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ఈవో

నెలరోజుల్లో నగరంలో మొదలుకానున్న ఉజ్జయని బోనాల జాతర

జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారం

ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ

ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం

సికింద్రాబాద్, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ఎం తో ప్రసిద్ధి చెందినవి..సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల నిర్వహణకు సం బంధించి  వివరాలను ప్రజా ప్రతినిధులకు ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి అందజేశారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాలు ఆషాఢ మా సంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ పండుగలో మొదటి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ, తొలి గురువారం లేదా ఆదివారం నాడు గో ల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి పూజ చేసి, మొదటి బోనాన్ని సమర్పిస్తారు.వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు అమ్మవారికి మొట్టమొదటి బోనాలు సమర్పిస్తారు.

ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు హైదరాబాద్ ఇంచార్జ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వారి కార్యాలయంలో మరియు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ఈ సంవత్సరం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లేఖను అందజేశారు. జులై 19 న ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 న అమ్మవారికి బోనాల సమర్పణ, 3 న రంగం (భవిష్య వాణి) ఉంటాయని ఈవో మనోహర్ రెడ్డి వివరించారు.