calender_icon.png 10 February, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసం చేసిన బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలి

10-02-2026 12:00:00 AM

పౌర హక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల

ముషీరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): గత మూడు సంవత్సరాల నుంచి తమతో పనులు చేయించుకుంటూ డబ్బు లు అడిగితే చంపేస్తామని ఓ బిల్టర్ బెదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్డారం గ్రామ కూలీలు వాపోయారు. బెదిరింపులకు పాల్పడుతున్న సం బంధిత బిల్డర్ మహ్మద్ ఫారుఖ్ పై విచారణ జరిపి తమకు న్యాయం చేయాని వారు కోరారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయుసీఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింద్యాలతో కలిసి రామస్వామి మాట్లాడారు.

మూడు నెలల క్రితం మోహిదీపట్నంలోని విజయనగర్ కాలనీలో మహ్మద్ ఫారూఖ్ అనే బిల్డర్ వద్ద కూలీ పనులు చేయించుకుంటూ అధ్వాన్స్ గా రూ. 5 లక్షలు ఇచ్చి పనులు పూర్తయిన తర్వాత రూపాయలు 30 లక్షల ఇస్తామని బిల్డర్ హామీ ఇచ్చారని,  సంబంధిత బిల్డర్ ఫారూ ఖ్‌ను డబ్బులు అడిగితే చంపుతామని బెది రిస్తున్నారని వాపోయారు. బిల్టర్ మహ్మద్ ఫారూఖ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఇంత మోసం చేస్తున్నా కార్మిక శాఖ పట్టించుకోకపోవడం బాధకరమన్నాడు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.