26 April, 2026 | 12:04 PM

తిర్యాణి అడవుల్లో కూంబింగ్

10-02-2026 12:00 AM

ఆసిఫాబాద్ జిల్లాపై నిఘా

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మహారాష్ట్ర నుంచి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు వచ్చిన నిఘా వర్గాల  సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. హైగ్రౌండ్ పోలీసులు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి జల్లెడ పడుతూ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పద కదలికలపై డేగ కన్నుతో నిఘా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.