1 September, 2026 | 1:49 AM

ఓఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలి

01-09-2026 12:08 AM

అధిక డోసుతో ఐదుగురు మృతి 

ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి

తెలిసి తెలవని వైద్యంతో నిండు ప్రాణాలు బలి

ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోరా..?

బెజ్జూర్(విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని బొగుడ గూడా (లంబాడి కూడా ) గ్రామానికి చెందిన తాళ్లపల్లి చాలు భాయి వైద్యం వికటించి మృతి చెందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 3 తేదీన కడుపునొప్పి లేవడంతో ఆర్ఎంపి నిహారిక వద్దకు తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఆర్.ఎం.పి వైద్యురాలు నిహారిక ముందుగా రెండు టాబ్లెట్స్, ఆ తర్వాత సెలూన్ బాటిల్ పెట్టి 3 ఇంజక్షన్లు వేయడంతో 15 నిమిషాల్లోనే ఒళ్లంతా చెమటలతో చల్లబడిపోయిందని కొద్దిసేపట్లోనే అక్కడే ప్రాణం పోయిందని చాలు బాయి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఆరోపిస్తున్నారు. తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఏమి చేసేది లేక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.

11 రోజుల తర్వాత సర్పంచ్ తో మాట్లాడి ఆర్ఎంపి పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపినట్లు తెలిపారు. ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈనెల 31 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బండారి ప్రవీణ్ కు ఆర్ఎంపి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కూడా అధిక మోతాదులో డోస్ ఇవ్వడంతో బొగుడ గూడ,మార్తిడి,పోతపల్లి, అందుగులగూడ గ్రామాలకు చెందిన వారు కూడా మృతి చెందినట్లు వారు ఆరోపించారు. ఇలా తెలిసి తెలియని వైద్యం చేయడంతో అమాయక పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.