ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌తో ఎరువుల బుకింగ్ సులభం
మండల వ్యవసాయ అధికారి డాక్టర్ దాసరి నవ్య
మంథని, ఆగస్టు 31(విజయ క్రాంతి): ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా రైతులు ముందస్తుగా ఎరువులు బుక్ చేసుకోవచ్చని మంథని మండల వ్యవసాయ అధికారి డాక్టర్ దాసరి నవ్య తె లిపారు. బుక్ చేసుకున్న 48 గంటల్లోనే ఎరువులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పట్టాదారులతో పాటు కౌలు రైతు లు, పోడు భూములు, దేవాదాయ, ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న రైతులందరూ ఈ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు.
నమోదు విధానం: ఆధార్, ఫోన్ నంబర్
ధ్రువీకరణ తర్వాత భూమి వివరాలను నమోదు చేయాలి. రికార్డుల్లో వివరాలు లేనివారు ‘భూమిని జోడించు’ ఆప్షన్ ద్వారా సర్వే నంబర్, విస్తీర్ణం నమోదు చేస్తే, వ్యవసాయ అధికారి పరిశీలించి ఆమోదిస్తారు.
ఎరువుల కొరత లేదు
జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బుకింగ్లో సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.






