1 September, 2026 | 1:59 AM

విద్యార్థుల ఆరోగ్యం.. విద్యాభివృద్ధే లక్ష్యం

01-09-2026 12:06 AM
  1. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు
  2. మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం

మంచిర్యాల, ఆగస్టు 31 (విజయక్రాంతి): విద్యార్థులు ఉదయం ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడ మే స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రే మ్సాగర్రావు (MLA Kokkirala Premsagar Rao) అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఏర్పాటు చేసి న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించా రు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొడంగల్, మధిర, మంథని తర్వాత మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు కావడం సంతోషకరమ న్నారు.

మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42, 450 మంది విద్యార్థులకు, 13 ప్రభుత్వ జూ నియర్ కళాశాలల్లోని 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్ర మైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు.

సింగరే ణి సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిందని, హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిందని తెలి పారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కిచెన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, ఆటోమేటిక్ వెజిటబుల్ వా షింగ్, కటింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నా రు. ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

పుష్కర ఘాట్కు భూమిపూజ..

మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరంలో గోదావరి పుష్కరాలు-2027 సందర్భంగా ఏర్పాటు చేయనున్న పుష్కర ఘా ట్కు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు భూమిపూజ చేశారు. మంచిర్యాల పుష్కర ఘాట్కు రూ. 12 కోట్లు, జిల్లాలోని ఇతర ఘాట్లకు రూ.16.70 కోట్లు, గూడెం పుష్కర ఘాట్కు రూ.9.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వా మి ఆలయం, మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయాల అభివృద్ధికి రూ.58 కోట్లతో చర్య లు చేపడుతున్నట్లు చెప్పారు.

పుష్కరాలకు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున శాశ్వత మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరా రు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటి స్తూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, సింగరేణి అధికారులు బుద్ధ ప్రకాష్, రాధాకృష్ణ, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు సత్య చంద్ర దాస్, కాంతయ్యదాస్, వ్యవసాయ కమిటీ చైర్మన్ భానేష్, కార్పొరేటర్లు చిలువేరు జ్యోతి, శేరు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.