30 July, 2026 | 2:02 AM

800 మందితో యాక్షన్ క్లుమైక్స్!

30-07-2026 12:00 AM

చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా, ‘మాస్ మావెరిక్’ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1960 నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్‌లో సాగే కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్ర యూనిట్ 22 రోజుల భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. కిరణ్ కుమార్ మన్నె వేసిన భారీ సెట్‌లో ఈ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.

ఈ ఒక్క షెడ్యూల్ కోసం దాదాపు మూడు నెలల పాటు ప్రత్యేకంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్వహించారు. శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.