ఆషికా తిరువీర్ పిల్లనట!
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, యువ నటుడు తిరువీర్ కలిసి ఓ కొత్త తెలుగు సినిమాలో నటించనున్నట్టు సమాచారం. ‘బేబి’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ తన సొంత బ్యానర్ ‘మాస్ మూవీ మేకర్స్’లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్రపరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డైలాగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చెపూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారట. ఆయన ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే హాస్య ప్రధాన ముక్కోణ ప్రేమకథగా రూపొందనున్నట్లు వినికిడి.
ఈ చిత్రానికి ‘అది నా పిల్లరా’ అనే క్రేజీ మాస్ అండ్ క్యాచీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ‘బేబి’ సినిమాలో పాపులర్ అయిన ఈ డైలాగ్‌నే సినిమా పేరుగా ఖరారు చేయటంతో ప్రకటనకు ముందే ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ ‘విశ్వంభర’, ‘సర్దార్ 2’ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా, తిరువీర్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.






