calender_icon.png 19 February, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతల స్వీకరణ

19-02-2026 02:38:18 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కుమ్రం  భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా షాహిన్ సుల్తానా గురువారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండ విఠల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు,నాయకులు  ఎమ్మెల్సీ ఈ సందర్భంగా సన్మానించారు.