19-02-2026 02:39:51 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తాయని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో అనేక కుటుంబాలు సురక్షిత నివాసం పొందుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.