ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ, జూలై 9 (విజయక్రాంతి) : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ బి.శివ గారు పాల్గొని స్వామి వివేకానంద, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని 5 మంది విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటాక్ నుంచి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వం తో ప్రపంచములోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందన్నారు.
కాశ్మీర్ ఆర్టికల్ 360 రద్దు కై నినదించి ఉద్యమించి విజయం సాధించిన ఘనత ఎబివిపి దన్నారు. అక్రమ వలసదారుల ఏరివేతకు సేవ్ అస్సాం టుడే.. సేవ్ ఇండియా టుమారో.. అని అక్రమ వలసదారుల వల్ల ఏర్పడే జాతీయ భద్రత విషయంలో ఎబివిపి చేసిన ఉద్యమాలు నేడు ఈశాన్య రాష్ట్రాలు భారత్ తో బలంగా నిలుచుటకు ఆధారం అయిందన్నారు. తెలంగాణ, బెంగాల్, కేరళ మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వామపక్ష విదేశీ కుట్రలను, నరహంతక నక్సలైట్ల తూటాలకు ఎదురించి, జాతీయ వాదాన్ని పెంపొందించటానికి అనేక మంది ఎబివిపి కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారన్నారు.ఈ సంఘానికి ప్రతి విద్యార్థి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్ సూర్య, విభాగ్ గరల్స్ కన్వీనర్ అమల, ఏబీవీపీ నాయకులు శివ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.






