10 July, 2026 | 3:07 AM

ఎల్లారెడ్డిలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం

10-07-2026 01:55 AM

ఎల్లారెడ్డి జూలై 9 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డిలో 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ. ఎల్లారెడ్డి పట్టణంలోని, అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలభారత్ విద్యా పరిషత్, జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ అనిల్ కుమార్  స్టేట్ వర్కింగ్ మెంబర్ పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు.   

ఏబీవీపీ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడు విద్యార్థులకు అండగా ఉంటూ విద్యార్థుల సమస్యల పైన పోరాడుతూ పాఠశాలలో కళాశాలలో మౌలిక సదుపాయాలు పట్ల విద్యార్థుల కోసం నిరంతరం కష్టపడుతూ అలాగే దేశం పైన భక్తితో దేశ హితం కోరుకునేటువంటిది, 

ఏబీవీపీ గత 78 సంవత్సరాలుగా అనేకమైన సమస్యల పైన పోరాడుతూ అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ దేశభక్తిని ప్రతి ఒక్క యువకుడి లోపల నింపుతూ ముందుకు సాగుతూ వస్తుంది అని విద్యార్థులతో అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మ వెంకట్,ఎల్లారెడ్డి కండ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, తులసి దాస్, ఎల్లారెడ్డి పూర్వ ఏబీవీపీ నాయకులు, మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.