10 July, 2026 | 3:08 AM

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

09-07-2026 05:30 PM

బెజ్జూర్ జూలై 9 (విజయక్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం  ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల ఇన్చార్జి విశ్వంత్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీవీపీ  దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సభ్యత్వం పొంది 78 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.ఇందుకు అనుగుణంగా మండలంలో కూడా ఏబీవీపీ సభ్యత్వాన్ని పొంది విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మెర బాలకృష్ణ తంగేడు పెళ్లి నీలేష్ ఏలేశ్వరం రమేష్ ,రామయ్య యాదవ్, లింగం పద్మాకర్, సామల తిరుపతి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు కంబాల అన్వేష్, గర్లపల్లి చరణ్ ,రాచకొండ అంజన్న, కేశెట్టి కౌశిక్ ,తైదల ప్రవీణ్, శరన్ ఉపాధ్యాయులు, కళాశాల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.