2 September, 2026 | 12:57 AM

ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి

02-09-2026 | 12:00am

ప్రధానమంత్రి మోదీకి లోక్ ఆందోళన్ న్యాస్ వినతి

ముషీరాబాద్, సెప్టెంబర్1(విజయక్రాం తి): జనగణన-2027లో ఓబీసీ జనాభాను ప్రత్యేకంగా, ప్రమాణీకృతంగా నమోదు చే సేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాల ని లోక్ ఆందోళన్ న్యాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంస్థ వర్కిం గ్ ప్రెసిడెంట్ కల్పనా ఇనామ్దార్ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ  ‘లోకతాంత్రిక న్యాయ అభియా న్’ పేరుతో నాలుగు ప్రధాన డిమాండ్లను కే ంద్రం ముందుంచినట్లు ఆమె తెలిపారు. జ నాభా న్యాయం, రాజకీయ న్యాయం, న్యా య న్యాయం, సమాఖ్య న్యాయం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జనగణన లో ఓబీసీలను శాస్త్రీయంగా లెక్కించి, కులాలు ఉపకులాలను పారదర్శకంగా మ్యాపింగ్ చేయాలని, మహిళల రాజకీయ రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే హైకోర్టుల్లో ప్రాం తీయ భాషల వినియోగం, న్యాయ నియామకాల్లో పారదర్శకత, సమర్థవంతమైన ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్ ఏర్పాటు చే యాలని కోరారు. డీలిమిటేషన్ అనంతరం ఏ రాష్ట్రం ప్రస్తుత లోక్సభ రాజకీయ ప్రాతినిధ్య వాటా తగ్గకుండా రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన-2027 లో ఓబీసీలకు ప్రత్యేక నమోదు విధానంపై 14 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ని ర్ణయం లేదా అధికారిక సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

స్పందన లేకపోతే దే శవ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమా లు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని, అవసరమైతే శాంతియుత నిరాహార దీక్ష చే ప డతామని కల్పనా ఇనామ్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి కమల్నాథ్ బాంబే హైకోర్టు అడ్వకేట్ శిల్ప మడకి పవర్, రఘు తదితరులు పాల్గొన్నారు.