2 September, 2026 | 12:28 AM

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

01-09-2026 | 11:37pm

వీర్నపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Employees Joint Action Committee)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినం(Pension Rebellion Day) సందర్భంగా వీర్నపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు గాజుల పురుషోత్తం మాట్లాడుతూ.. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు సి పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ( ఓ పి ఎస్ )ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పిఆర్సి అమలు, పెండింగ్ డి ఏ ల విడుదల, ఉద్యోగులు–పెన్షనర్ల పెండింగ్ బిల్లుల మంజూరు తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.