మంథనికి ‘మహర్దశ’
- ఐటీ హబ్తో పాటు మట్టణంలో మంథని లో 4 లైన్ల రహదారుల పరుగులు
- నియోజకవర్గ రూపురేఖలపై ప్రత్యేక ప్రణాళికలతో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, జూన్ 23 (విజయ క్రాంతి)మంథనిని పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. మంథనిలో ఐటీ హబ్ ఏర్పాటుతో పాటు, మంథని పట్టణాన్ని నాలుగు లైన్ల రహదారులతో అను సంధానిస్తూ, రాబోయే ఏడాదిలో మంథని రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు ఆయ న ప్రణాళికలు సిద్ధం చేశారు.
మంథనిలో ’ఐటీ హబ్’ యువతకు ఉపాధి పండుగ
నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు మంథనిలో అత్యాధునిక ఐటీ హబ్ను మంత్రి శ్రీధర్ బా బు ఏర్పాటు చేశారు. ఇది స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధిని అందించడమే కాకుం డా, మంథనిని టెక్నాలజీ హబ్గా మార్చనుంది.
నాలుగు లైన్ల రోడ్లతో వ్యూహాత్మక’ కనెక్టివిటీ
మంథనిని రవాణా జంక్షన్గా మార్చే క్రమంలో భాగంగా, పట్టణంలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. పాత పెట్రోల్ బంక్ నుం చి బస్ డిపో వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ, అలాగే మంథని పుట్టపాక మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నాయి.
గోదావరి తీరాన 125 కోట్లతో భారీ వారధి
మంచిర్యాల జిల్లా చెన్నూరును మంథనితో అనుసంధానిస్తూ గోదావరి నదిపై రూ. 125 కోట్లతో నిర్మించనున్న వంతెన.. భ విష్యత్తు వాణిజ్య అవసరాలకు ఊపిరిపోస్తోంది. కూచిరాజుపల్లి నుంచి రూ. 80 కోట్ల తో శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు నిర్మాణం మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
పాలన, వైద్యం, మార్కెటింగ్ - సర్వాంగ సుందర మంథని
మినీ కలెక్టరేట్, కొత్త మున్సిపల్ కార్యాలయాలతో వేగవంతమైన పాలనను, 50 పడకల ఆసుపత్రితో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు మంత్రి అందుబాటులోకి తెస్తున్నారు. రూ. 2 కోట్ల వ్యయంతో కూరగాయల, నాన్-వెజ్ మార్కెట్లను మోడల్ మార్కెట్లుగా తీర్చిదిద్దుతున్నారు.అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం‘ అనే మంత్రి శ్రీధర్ బాబు దార్శనికత నేడు మంథనిలో అక్షరాల నిజమవుతోంది. రాబోయే ఏడాదిలో మంథని రాష్ట్రానికే ఆదర్శ పట్టణంగా నిలుస్తుందని స్థానిక ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.






