4 July, 2026 | 2:00 AM

బాల మందిరంలో సరస్వతి దర్శనం

04-07-2026 12:00 AM

భైంసా జూలై 3  ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర పునరుద్ధరణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల ఐదు నుంచి అమ్మవారి దర్శనం బాల ఆలయంలో నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో అంజలీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ బాల ఆలయం లో భక్తుల దర్శనానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

భక్తులకు పురాతన అమ్మవారి గర్భగుడిలో అనుమతి రద్దు చేయడం జరిగింది అన్నా రు.శృంగేరి పీఠాదిపతి సూచనల మేరకు అమ్మవారి మూల విరాట్టు కు గర్భగుడిలో యధావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశం లో ఏ ఈవో శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్... తదితరులు ఉన్నారు.