గాలివాన బీభత్సం
తడిసిముద్దైన ధాన్యం.. లబోదిబోమంటున్న రైతులు.
రైతులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం
మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల సరైన మౌళిక వసతులు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
దీనితో రైతులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ఆది నుంచి నిర్లక్ష్యం వహిస్తుండటంతో కాంటా వేసిన వేల బస్తాలు, ఆరిన ధాన్యం వర్షానికి నీటిపాలయ్యాయి. ఆరిన ధాన్యాన్ని సరైన సమ యంలో తూకం వేయకపోవడం, ఒక వేల వేసినా వాటిని రోజుల తరబడి కేంద్రాల్లో ఉంచడం, మిల్లులకు తరలించకపోవడంతో రైతులు అరిగోసపడుతున్నారు.
తడిసిముద్దైన ధాన్యం.. లబోదిబోమంటున్న రైతులు...
మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి జిల్లాలోని కొన్ని మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలమ ట్టమైంది. మరోవైపు రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట సైతం వర్షంతో వరద పాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భ ద్రపరచడానికి టార్ఫాలిన్ లు ఇవ్వకపోవడంతో వర్షం పడితే రైతులు విలవిలలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం తూకం వేసిన సంచులను మిల్లులకు తరలించకపోవడంతో వేల బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి.
తూకం వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండదు, కానీ తూ కం వేసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టాలని, లేకుంటే ధాన్యం ఇక్కడే ఉంటుందని కేంద్రాల నిర్వాహకులు బెదిరిస్తున్నారని రైతులు వా పోతున్నారు. అధికారులు సైతం ఆరిన త ర్వాతే తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పడంతో చేసేదేమి లేక తుంటికి పావుసేరు న ష్టానికి మిల్లులకు తరలిస్తున్నారు.
రైతులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం...
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎండ, వాన నుంచి తలదాచుకునేందుకు కనీసం తాత్కాలిక షెడ్లు కూడాలేవు. చిన్న చిన్న కుటీరాలు, అవి కూడా కేవలం గన్నీసంచులు నిలువ చేసేందుకు వేసి చేతులు దులుపుకున్నారు.
కొన్ని కేంద్రాల్లో అయితే కేవలం చెట్లు, గట్ల కిందనే రైతులు తలదాచుకుంటున్నారు. మరోవైపు ప్రతి కొనుగోలు కేంద్రా నికి మార్కెట్ కమిటీ నుంచి టార్ఫాలిన్ కవర్లు అందజేస్తుంటే అవి మాత్రం ఎక్కడా రైతులకు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనితో అకాల వర్షాలకు రైతులు నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.






