ఐఐటీ జేఈఈ మెయిన్స్ బి.ఆర్క్, బి. ప్లానింగ్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్‌కు అద్భుత ర్యాంకులు
ముకరంపుర, మే 6(విజయ క్రాంతి) ఐఐటి జేఈఈ మెయిన్స్ బి. ఆర్క్ బి. ప్లానింగ్ 2026 ఫలితాలలో మా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలుపుటకు సంతోషిస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.బి. ఆర్క్ లో ఎస్. శ్రీహిత 174 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, పటేల్ అక్షయ 189 వ ర్యాంకు, డి. తనుశ్రీ 227 వ ర్యాంకు, వి. రితిక 287 వ ర్యాంకు, ఎస్. ఆధ్య 319వ ర్యాంకు, టి. వెంకట నిహిత్ 903 వ ర్యాంకు, సి. హెచ్. భీమ 1107 వ ర్యాంకు, ఆర్. నేహగాయత్రి 1719 వ ర్యాంకు, పి. శ్రీనిధి 1776 వ ర్యాంకు, పి. హర్షిణి 2325 వ ర్యాంకు, ఉమైరా సన్నున్ 2626 వ ర్యాంకు, పి. అక్షయప్రియ 2786 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అలాగేబి .ప్లానింగ్ లో వి. ప్రణతి 858వ ర్యాంకు, పి. క్రిష 1281 వ ర్యాంకు, ఎమ్. వివేక్ రెడ్డి 1554 వ ర్యాంకు, ఎమ్. షాలిని 1757 వ ర్యాంకు,
రహీన్ ఉమేద 2448వ ర్యాంకు, జి. మహాలక్ష్మి 3053 వ ర్యాంకు, పి. ఆదిత్యలక్ష్మి 3122 వ ర్యాంకులు సాధించారన్నారు.రాబోయే ఐఐటి అడ్వాన్స్ పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందముచే కోచింగ్ ఇస్తున్నామని పటిష్ట ప్రణాలికతో విద్యా భోధన మరియు నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల మరియు అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని ఈ సంధర్భముగా తెలియజేశారు.ప్రతి సంవత్సరము ఐఐటి, నీట్ ,మరియు ఎప్సెట్ పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు . ఈ ఫలితాలలో ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని ఇంతటి ఘన విజయమునకు తోడ్పడిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.






