03-02-2026 12:36:29 PM
ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మితిమీరిన వేగం కారణంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా కొట్టిన ఘటనలో కారు డ్రైవర్తోపాటు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తాడూరు మండలం అల్లాపూర్ గేట్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికులు గమనించి వెంటనే 108 సాయంతో గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి లింగంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు కల్వకుర్తి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.