17 July, 2026 | 1:30 AM

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

17-07-2026 01:19 AM

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు 

చేగుంట, జూలై 16: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం చేగుంట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, రిసెప్షన్ విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.పెండింగ్లో ఉన్న కేసులను నాణ్యతతో, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కేసులో శాస్త్రీయ ఆధారాలు సేకరించి చట్టబద్ధంగా దర్యాప్తు నిర్వహించాలని సూచించారు.పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ విధులను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా స్వాగతించి, వారి ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, చట్టప్రకారం సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో సీఐ రాజా శేఖర్ రెడ్డి, రామాయంపేట సి ఐ సైదా, చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.