17 July, 2026 | 1:33 AM

ఆడ బిడ్డకు అండగా ప్రభుత్వం..

17-07-2026 01:28 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రోహిత్ రావు

పాపన్నపేట, జులై16: ఆడబిడ్డకు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్ పల్లి గ్రామంలో మత్స్యకారులకు మెంబర్షిప్ కారడ్స్ అందజేసి, గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను ప్రారంభించారు. అనంతరం మండలంకు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయ మీటింగ్ హాల్ లో అందజేసారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించి, వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్, ఆయా గ్రామాల సర్పంచులు పావని, శ్రీధర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు మల్లప్ప, ప్రభాకర్ రెడ్డి, భూపతిరాజ్, గౌస్ పాషా, ఖలీం తదితరులు పాల్గొన్నారు.