06-02-2026 12:58:59 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్.. నెలకు ఒక స్కామ్‌తో స్కాం క్యాలెండర్ అ మలు చేస్తున్నారని, పాలన గాలికొదిలి, జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన జాతి పిత కేసీఆర్‌ను చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని అన్నారు.
గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసి సభ్య సమాజం ఛీకొడుతోందని, రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే ఇలా చిల్లర మాట లు మాట్లాడటం దారుణమన్నారు.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నిజం చేసింది కేసీఆర్ అని, అందు కే తెలంగాణ సమాజం కేసీఆర్‌ను తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షను నిజం చేసిన జాతిపి తగా పిలుచుకుంటారని స్పష్టం చేశారు. దీన్ని చూసి రేవంత్‌రెడ్డికి ఎం దుకంత కడుపునొప్పి?, ఎందుకు నోరు పారేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి సీ ఎంకు ఆ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉంటుందని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ చరిత్రలో బూ తుల ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని విమర్శించారు.
నెలకో స్కాం పక్కాగా అమలు..
రేవంత్‌రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ స్కాం క్యాలెండర్ మాత్రం ఇచ్చారని, ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని విమర్శించారు. జనవరిలో సివిల్ సప్లుసై స్కాం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లు యాష్ స్కాం, మార్చి లో సాండ్ స్కాం, ఏప్రిల్‌లో ఆర్టీసీ స్కాం, మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కాం, జూన్‌లో ఫోర్త్ సిటీ స్కాం, జూలైలో లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కాం, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కాం, సెప్టెంబర్‌లో హిల్ట్ పాలసీ ఇండస్ట్రియల్ స్కాం, అక్టోబర్‌లో పవర్ స్కామ్, నవంబర్‌లో సింగరేణి స్కాం, డిసెంబర్‌లో ముఖ్యమంత్రి, కేఎల్‌ఎస్‌ఆర్ స్కామ్ అని వివరించారు.
ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ, రేవంత్ రెడ్డి పాలనలో నెలకు ఒక స్కా మ్ మాత్రం పక్కాగా జరిగిందని, తన కుంభకో ణాల గురించి మేము ప్ర శ్నిస్తే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి తిట్ల దండ కం అందుకుంటారన్నారు. స్కీములు అడిగితే డైవర్షన్, హామీలడిగితే డైవర్షన్ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం
దావోస్ వెళ్లి వచ్చినా ఎన్ని పెట్టుబడులు తెచ్చా రో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో రేవంత్‌రెడ్డి చెప్పలేదన్నారు. రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, మహబూబ్‌నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా ఇచ్చింది ‘నువ్వే కదా రేవంత్ రెడ్డి?’ అని నిలదీశారు. బీజేపీ జాతీయనేతలు వచ్చి ఆర్‌ఆర్ టాక్స్ అని అవినీతి గురించి మాట్లాడతారు తప్ప, ఎలాంటి ఎంక్వైరీ చేయరన్నారు. పొంగులేటి ఇంటిపై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ, ఈడీ రైడ్లు జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటకు రావడం లేదని, ఇది కాంగ్రెస్- చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి సీఎం కావడం ప్రజల దౌర్భాగ్యం
రెండున్నరేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో చేసింది గానీ, రాష్ర్టంలో తెచ్చిన మార్పు గానీ ఏమీ లేదని స్పష్టం చేశారు. తన పాలనపై తనకే సంతృప్తి లేక, తన చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బూతు భాషను ఎంచుకున్నారన్నారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపో యిన వ్యక్తిలా అదుపుతప్పి, ఆలో చనారహి తంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.