calender_icon.png 5 February, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి పాటుపడుతా

05-02-2026 01:50:09 AM

కరీంనగర్ 24వ డివిజన్ బీజేపీ అభ్యర్థి సత్యనారాయణరెడ్డి

ముకరంపురా, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): డివిజన్ అభివృద్ధికి పాటుపడుతా నని, తనకు ఓటేసి గెలిపించాలని కరీంనగర్ 24వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఒంటెల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. రెండు పర్యాయాలు గెలిచి అన్ని రంగాలలో అభివృద్ధి చేశానన్నారు. కార్పొరేటర్ వద్దకు ప్రజలు అని కాకుండా, ప్రజల వద్దకే కార్పొరేటర్ అనే నినాదంతో పనిచేసినట్టు తెలిపారు. అనేక సమస్యలు పరిష్కరించానని గుర్తు చేశారు. అందుబాటులో ఉండే అభ్యర్థిని ఎంచుకోవానలి కోరారు.