06-02-2026 12:51:41 AM
కరీంనగర్‌కు రూ.1,400 కోట్లు విడుదల చేశానన్న సీఎం రేవంత్ నిరూపించాలి
బండి సంజయ్ సవాల్
కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కరీంనగర్‌కు రూ.1,400 కోట్లు విడుదల చేశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అని, దీనిపై శ్వేత ప త్రం విడుదల చేసే దమ్ముందా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు నయాపైసా ఇవ్వలేద ని అన్నారు. నన్ను కోసినా నయాపైసా లేద ని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎన్నికలొస్తున్నాయని అబద్ధాలాడుతున్నరని పేర్కొన్నారు. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని అన్నారు. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారన్నారు.