calender_icon.png 6 February, 2026 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19వ డివిజన్‌లో ప్రచారంలో దూసుకుపోతున్న సుధగోని మాధవి కృష్ణగౌడ్

06-02-2026 12:31:19 AM

ముకరంపు, ఫిబ్రవరి ౫ (విజయక్రాంతి): నగరంలోని 19వ డివిజన్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సుధగోని మాధవి కృష్ణగౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని ద్వారకానగర్, హనుమాన్ నగర్, ప్రగతినగర్, టీచర్స్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేటర్ గా గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సుధగోని మాధవి కృష్ణగౌడ్ మాట్లాడుతూ గతంలో కోట్లాది రూపాయలతో డివిజన్లో అభివృద్ధి పనులు చేశామన్నారు. సమక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. డివిజన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. కారు గుర్తుకు ఓటువేసి మరోసారి కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.