05-02-2026 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్, బిఆర్ఎస్ , బిజెపి లు ప్రచారం ముమ్మరం చేశా యి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదు ను పెడుతోంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండు సార్లు జూమ్ సమావేశాలు నిర్వహించారు.
ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం (ఫిబ్రవరి 5) న చొప్పదండి మండలం గంలాపూర్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగే సభలో సి ఎం తో పాటు ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పాల్గొంటారు.
పరిశీలించిన తుమ్మల
ఫిబ్రవరి 5వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, స్థానిక నాయకులు, అధికారులు, శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుసభా స్థలా న్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సంద ర్భంగా సమీక్షించారు. సి ఎం సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ప్రతి మున్సిపాలిటీ నుండీ...
సి ఎం సభ విజయవంతం కోసం విస్తృత ఏ ర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కరింనగర్ లో పర్యటించిన ఇంచార్జి మంత్రి తు మ్మల నాగేశ్వర్ రావు నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశనం చేశారు. చొప్పదండి కి దగ్గరలో ఉన్న కరీంనగర్ నుండి డివిజన్ కు 500 కు తగ్గకుండా తరలి వెలాలని నిర్ణయించారు. మిగితా మూసిపాలిటి ల నుండి అభ్యర్థుల తో పాటు అనుచరులు తరలి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.