calender_icon.png 6 February, 2026 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా పీఆర్‌వో చెప్పినట్టే..!

06-02-2026 12:27:45 AM

నాడు ఓ మంత్రి వద్ద.. నేడు ఓ ఇంచార్జి వద్ద..

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వద్ద పీఆర్వోలుగా పనిచేసే వారి చర్యల వల్ల సిసలైన కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందిగా మా రుతుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కరీంనగర్ యోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు వద్ద పి’ఆర్’ వోగా ఉన్న వ్యక్తి వ్యవహారశైలి తలనొప్పిగా మారిం ది. అన్నీతానై సదరు నాయకుడిని తప్పుదోవ పట్టించడం వల్ల టికెట్ల విషయంలో చా లాచోట్ల పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. సదరు పీఆర్వో గతంలో ఓ మంత్రి వద్ద పనిచేసి రా జ్యాంగేతర శక్తిగా మెదలడం, ఎన్నికల సమయంలో ఇతని వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆ మంత్రి అతన్ని పక్కకు పెట్టారు.

అనంతరం ఆ వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓ ఎమ్మెల్సీ అభ్య ర్థి వద్ద పీఆర్వోగా చేరి ఆయన వద్ద కూడా తాను చెప్పిందే నడిచేలా వ్యవహరించడంతో ఆ అభ్యర్థికి అదికాస్తా నష్టం చేకూర్చి పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నాయకుడు ఓడిపోవడంతో పీఆర్వో అక్కడి నుండి జారుకొని మళ్లీ పలువురి వద్ద పీఆర్వోగా చేరేందుకు ప్రయత్నించగా ఇతని వ్యవహారశైలి తెలిసినవారు దగ్గరకు రానీయలేదు. ఇంతలోనే వెలిచాల రాజేందర్ రావు అతనికి బం గారు బాతులా దొరకడంతో ఆయనవద్ద చేరి చక్రం తిప్పుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకోతున్నారు. రాజేందర్రావు మంచోడే.. కానీ ఇతని చక్రబంధంలో చిక్కుకున్నాడని వాపోతున్నారు.

ఇతను పనిచేసేచోట నాయకున్ని కల వాలంటే ఇతని అనుమతి ఉండాల్సిందే. ఏదైనా కార్యక్రమానికి ప్రకటనలు కానీ, ఖ ర్చులు కానీ కావాలంటే ఇతను చీటి రాసి ఇ వ్వవలసిందే. అలా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుండడంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటు న్నారు. ఇతనిపై ఫిర్యాదు చేద్దామన్నా సదరు నాయకుడు వినే పరిస్థితి లేకపోవడం మరింత కలిసివస్తుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫలానా చోట ప్రసంగించాలన్నా, ఆ ప్రసంగంలో ఏ అంశాలు మాట్లాడాలన్నా ఇతని స్క్రిప్టే బట్టి పడుతుండడంతో ఇతను మరింత పాతుకుపోయాడు. ఇతని నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.