30 April, 2026 | 1:31 AM

పదవ తరగతి ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా పరిషత్ విద్యార్థులు

30-04-2026 12:40 AM

పాలకవీడు , ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో భాగంగా మండలంలో 99% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఇంజమూరి కాటయ్య తెలిపారు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొత్తలపాలెం పాఠశాల విద్యార్థిలు పి. ప్రణతి 538 యు. మహాలక్ష్మి 538 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారు  కెజిబివి పాఠశాల విద్యార్థులు పి.అంజలి,530,కె.అంజలి,529 సాధించారు

పాలకవీడు మండలంలోని కెజిబివి,వివిధజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి పరీక్షకు హాజరైనవారు 87 ఉత్తీర్ణత సాధించిన వారు 86 ఉత్తీర్ణత శాతం99% ఫలితాలను సాధించారని మండల విద్యాశాఖాధికారి కాటయ్య ఇంజమూరి పేర్కొన్నారు.

తుంగతుర్తిలో పదవ తరగతి ఉత్తీర్ణత 99.77శాతం

తుంగతుర్తి ఏప్రిల్ 29: పదవ తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలు కలిపి 99.77 శాతము ఉత్తీర్ణత సాధించబడినది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొట్టిపర్తి ( 94 % ) తప్ప మిగతా అన్ని పాఠశాలలో 100% ఫలితాలు సాధించబడినవి అని మండల విద్యాధికారి బోయిన లింగయ్య తెలిపారు.

బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలములో 569 మార్కులతో ఆర్ పి ఆర్ పి పాఠశాల విద్యార్థిని కుమారి వెలుగు లిఖిత మండలంలో మొదటి స్థానము నిలిచినది. రెండవ స్థానము మేరీ మదర్ పాఠశాలకు చెందిన షేక్ యాసీన్ 556 మార్కులతో ఉన్నారు తుంగతుర్తి మండలం నుండి మొత్తము 454 విద్యార్థులు హాజరుకాగా అందులో 453 మంది ఉత్తీర్ణ సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.