24 August, 2026 | 11:20 PM

గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి

24-08-2026 09:54 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): గణేష్ మాండపాలకు, దుర్గ మాత మాండపాలకు ఉచిత కరెంటు సరఫరా చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణి లో వినతి పత్రం సమర్పించారు. ఎలక్ట్రిసిటీ అధికారులు అనవసరంగా మండపం నిర్వాహకులకు వేధించవద్దని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అంతే కాకుండా రోడ్లపై గుంతలు ఏర్పడకుండా మరమ్మతులు చేయాలనీ విద్యుత్ అంతరాయం, విద్యుత్ షాట్ సర్క్యూట్ కాకుండా సిబ్బంది ని నియమించాలని కోరారు. నిమర్జనం సమయంలో దోభిఘాట్ రోడ్డు నుండి గుండ్ల చెరువు వరకు సరైన లైటింగ్ సదుపాయాలు, మున్సిపాలిటీ నుండి క్రేన్ లను అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది.