24 August, 2026 | 11:20 PM

ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!

24-08-2026 09:57 PM

గడువు సమీపిస్తున్నా రెవెన్యూ అధికారుల జాప్యం

ఆలేరు,(విజయక్రాంతి): చేయూత పింఛన్ల కోసం ఒంటరి మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఆలేరు రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు ఎంఏ ఇక్బాల్ ఆరోపించారు. 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 31 చివరి గడువు కావడంతో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.