24 August, 2026 | 11:21 PM

సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

24-08-2026 09:56 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఝరాసంగంలోని ప్రసిద్ధ శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు బీర్ల అయిలయ్యకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. సంగమేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఝరాసంగం కేతకీ సంగమేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందని, ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.