24 August, 2026 | 11:21 PM

ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం

24-08-2026 10:01 PM

సిద్దిపేట కలెక్టరేట్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కుకునూరుపల్లిలో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు వాక్‌ఇన్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డి.వెంకట్‌ రమణ తెలిపారు. ఐటీఐలో చేరాలనుకునే అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో నేరుగా కార్యాలయానికి హాజరై ప్రవేశాలు పొందవచ్చన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఐటీఐ కార్యాలయంలో ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రవేశ రుసుము రూ.100, వర్తించే పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.