24 August, 2026 | 11:19 PM

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

24-08-2026 10:04 PM

నేరేడుచర్ల ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమకున్న సమస్యలు పరిష్కరించుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సోమసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12 దరఖాస్తులు వచ్చాయని, డిపార్ట్మెంట్ వారీగా వివరాలు రెవిన్యూకు  సంబందించినవి 07,హోసింగ్  డిపార్ట్మెంట్ కు 03, ఆర్ ఎండ్ బి శాఖకు 01,పంచాయతీ  రాజ్  శాఖకు 01. ఈ కార్యక్రమంలో మొత్తం 21 శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారని తెలిపారు.