13 May, 2026 | 12:57 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన

20-03-2026 04:19 PM

జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు

హైదరాబాద్:  ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల పంచాయతీపై తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma ) సంచలన ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని నోటరీ చేసిన నోట్ ను విజయమ్మ విడుదల చేశారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని పేర్కొన్నారు. ఆస్తులన్నీ నలుగురు మనవలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని తెలిపారు. వైఎస్ ఆదేశం కూడా అదే.. దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదన్నారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని స్పష్టం చేశారు.

అందుకే జగన్ ఎంఓయూ రాశాడని విజయమ్మ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటూ షర్మిలకు తక్కువే రాశాడని వెల్లడించారు. సరస్వతి సిమెంట్ సహా యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అన్నారు. ఇచ్చానని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండే అన్నారు. జగన్ తన మేనల్లుడికి, మేకకోడలికి అన్యాయం చేశాడని విజయమ్మ ఆరోపించారు. జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. షర్మిలకు ఇచ్చిన ఆస్తులు లాంటివి జగన్ కు కూడా వైఎస్ ఇచ్చారని స్పష్టం చేశారు. అది ఆస్తి పంపకం కాదన్నారు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కీ తెలుసన్నారు. అబద్ధాలు ప్రచారం చేయవద్దని చేతులు జోడించి కోరుతున్నానని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి సాక్షిగా నేను రాసి ఇచ్చినవన్నీ వాస్తవాలేనని విజయమ్మ ప్రకటించారు.