21 March, 2026 | 4:31 PM

మొజ్తాబా బతికే ఉన్నారు!

21-03-2026 12:00 AM

ఆయన మతపరమైన బోధనలు చేస్తున్న వీడియోను విడుదల చేసిన ఐఆర్‌ఐబీ

టెహ్రాన్, మార్చి 20: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నట్లు ఇరాన్ ఓ వీడియోనూ విడుదల చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల వస్తున్న వదంతులకు చెక్ పెట్టింది. ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఐబీలో ఖమేనీ వీడియో ప్రసారం అయ్యింది. సుప్రీం నేత కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

అమెరికా- జరిపిన దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత మొజ్తాబా బాహ్య ప్రపంచానికి కన్పించడం ఇదే తొలిసారి. ఇక, మొజ్తాబా ఆరోగ్యంపై ఇటీవల పలురకాల వదంతులు వినిపించాయి. తొలిరోజు జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గా యపడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

సుప్రీం నేతగా ఎన్నికైనప్పటికీ ఆ యన బహిరంగంగా కన్పించకపోవడంతో.. ఆ ఊ హాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కూడా సుప్రీం నేత ప్రాణాలతో ఉండటంపై అనుమానాలు వ్యక్తంచేయడం తీవ్ర చర్చనీయాంశ మైంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ మీడి యా ఆయన వీడియోను విడుదల చేసింది.