calender_icon.png 22 February, 2026 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి యువత ప్రకాష్ రెడ్డి అడుగుజాడల్లో నడవాలి

22-02-2026 06:31:40 PM

ఆర్ఎస్ఎస్ నేత నారాయణరెడ్డి

తాజా ,మాజీ ప్రజాప్రతినిధులకు 

సి పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్  ఘన సన్మానం

తాండూరు,(విజయ క్రాంతి): నేటి యువత స్వర్గీయ చిట్టెపు ప్రకాశ్ రెడ్డి అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత పేట నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో స్వర్గీయ చిట్టి ప్రకాష్ రెడ్డి స్మారకార్థం తాజా మాజీ ప్రజా ప్రతినిధులకు ఆయన కుమారుడు చిట్టపు రాఘవేందర్ రెడ్డి ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు.

ప్రకాష్ రెడ్డి పేదోళ్లు, పెద్దోళ్ళు, సమస్యను పరిష్కరించాలని కోరితే రాజకీయాలకతీతంగా నీతి నిజాయితీగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించే వారని ఆయన గుర్తు చేశారు, రామ మందిరం నిర్మాణం కోసం 1992 సంవత్సరంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం వెళ్లే వారిని సంఘం పెద్దలు అయోధ్య వెళితే తిరిగి ఇంటికి  వస్తామో,  లేదో ..అని మీకు తెలుసా అని ప్రశ్నించాగా అందుకు ప్రకాష్ రెడ్డి సమాధానం ఇస్తూ.. వస్తే ఏంది పోతే ఏంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణమే తమ జీవిత లక్ష్యమని ధైర్యంగా చెప్పిన దీశాలి  ప్రకాష్ రెడ్డి అని గుర్తు చేశారు.

స్థానికులైన కందనెల్లి సత్యం, మోహన్ లాల్ తదితరులతో కలిసి అయోధ్య కు వెళ్లామని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఉంటూ కొందరు నాయకులు ఆస్తులు కూడా బెట్టుకుంటున్న ఈ రోజుల్లో అతను మాత్రం ప్రజాసేవ కోసం సొంత డబ్బులను ఖర్చు చేయడం ఆషామాషీ కాదని. .. మా గురించి ఏం చేశావు నాన్న? అని కొడుకులు ప్రశ్నించడం చూసానని కానీ. .ప్రకాష్ రెడ్డి తనయుడు రాఘవేందర్ రెడ్డి మాత్రం తన తండ్రి జ్ఞాపకార్థం తాజా, మాజీ ప్రజా ప్రతినిధులను సన్మానించడం అభినందనీయమని ప్రశంసించారు.

సిపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చిట్టపు రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలో తాను ఎక్కడికి వెళ్లినా తన తండ్రికి ఏ పదవి లేకున్నా కూడా అతని గురించి గొప్పగా చెప్పడంతో నాన్న జ్ఞాపకార్థం కోసం ఏదైనా చేయాలన్న తపనతో మండలంలో ఉన్న తాజా  మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మండలంలో రెండు నెలలుగా పర్యటించి 230 మంది ప్రజాప్రతినిధులను గుర్తించి సన్మానం చేయడం జరిగిందన్నారు. 

సభ వద్ద ఏర్పాటుచేసిన ఆడియో వీడియో పాటకి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కంటతడి పెట్టారు, ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, తట్టేపల్లి పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ డివై నరసింహులు, తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, మాజీ చైర్పర్సన్ బుజ్జమ్మ, మరియు మండల తాజా మాజీ సర్పంచ్లు ఎంపిటిసిలు భారీగా పాల్గొన్నారు.