calender_icon.png 22 February, 2026 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారబోయిన కనకయ్యకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి నివాళి

22-02-2026 06:34:40 PM

మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజు  తండ్రి, రిటైర్డ్ ఉద్యోగి నారబోయిన కనకయ్య (82) ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కన్నుమూశారు. వార్త తెలిసిన వెంటనే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పట్టణంలోని వారి నివాసానికి చేరుకుని కనకయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనకయ్య నిష్కళంకంగా సేవలందించిన విధానం ఆదర్శనీయమని కొనియాడారు. వారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.కనకయ్య మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.