calender_icon.png 22 February, 2026 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న ‘ఆక్రందన దీక్ష’కు బీసీ సాధికారిత సంఘం మద్దతు

22-02-2026 06:25:03 PM

వేములవాడ,(విజయక్రాంతి): ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఆక్రందన దీక్ష”కు రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కోర్టులు, కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నాయని ప్రభుత్వం చెబుతుండటం సరైన కారణం కాదన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మంత్రి, ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇవ్వాలని, బడ్జెట్‌లో ప్రకటించిన బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, రిజర్వేషన్ల అమల్లో జాప్యం, చిన్నచూపు తగదని హెచ్చరించారు. అవసరమైతే బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని స్పష్టం చేశారు.